భారతదేశం, మార్చి 19 -- మ‌ల‌యాళం హార‌ర్ మూవీ హంట్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న‌ట్లు ఓ పోస్ట‌ర్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. మార్చి 28న ఈ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హంట్ మూవీలో భావ‌న హీరోయిన్‌గా న‌టించింది. ఈ హార‌ర్ మూవీకి మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హంట్ మూవీలో భావ‌న‌తో పాటు రెంజీ ఫ‌ణిక్క‌ర్‌, అజ్మ‌ల్ అమీర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2006లో రిలీజైన చింతామ‌ణి కోలాకేస్ త‌ర్వాత 18 ఏళ్ల అనంత‌రం భావ‌న‌, డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హంట్‌ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌క...