భారతదేశం, ఏప్రిల్ 5 -- Horror OTT: త‌మిళ హార‌ర్ మూవీ ముర్‌ముర్ ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైంది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్‌కోట ద్వారా ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ముర్‌ముర్ ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

ఫౌండ్‌ఫుటేజ్ కాన్సెప్ట్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ముర్‌ముర్ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాకు హేమంత్ నారాయ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో ద్వారా ప‌లువురు కొత్త యాక్ట‌ర్స్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రిచీక‌పూర్‌, దేవ‌రాజ్ ఆర్ముగం, సుగ‌ణ్య ష‌ణ్ముగం, యువిక రాజేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

టెక్నిక‌ల్‌గా ముర్‌ముర్‌ మూవీ బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం యావ‌రేజ్‌గా నిలిచింది. కానీ బ‌డ్జెట్ త‌క్కువ కావ‌డంతో నిర్మాత‌ల‌కు ఈ హార‌ర్ మూవీ లాభాల‌ను తెచ్...