భారతదేశం, మార్చి 1 -- Horror Comedy OTT: మ‌ల‌యాళంలో గ‌త ఏడాది చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది హ‌లో మ‌మ్మీ మూవీ. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజైంది. త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లో హ‌లో మ‌మ్మీ మూవీ విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం.

హ‌లో మ‌మ్మీ మూవీలో ష‌రాఫుద్దీన్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ హార‌ర్ కామెడీ మూవీకి వైశాఖ్ ఎలాన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో జ‌గ‌దీష్, జానీ ఆంటోనీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించాడు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 21న హ‌లో మ‌మ్మీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ మూవీ కాన్సెప...