భారతదేశం, మార్చి 25 -- Horror Comedy Movie: కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన లోప‌లికి రా చెప్తా మూవీ టీజ‌ర్ రిలీజైంది. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంక‌ట రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను యాంక‌ర్ అంజ‌లి రిలీజ్ చేసింది.

రెండు జంట‌ల జీవితాల‌ను చూపిస్తూ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. వాడు ఎంత దుర్మార్గుడు అయినా వాడికి నీ మీద ఉన్న ప్రేమ ప‌చ్చి నిజం...నిజంగానే మ‌నం ప్రేమ‌ను చూపించ‌డం మ‌ర్చిపోతాం లాంటి డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. టీజ‌ర్‌కు బీజీఎమ్ హైలైట్‌గా నిలుస్తోంది.

టీజ‌ర్ రిలీజ్ వేడుక‌లో యాంక‌ర్ అంజలి మాట్లాడుతూ సంప్రదాయబద్ధమైన మూవీ టీజర్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఇది భార్యాభర్తలు కలసి చూడవలసిన స...