భారతదేశం, ఏప్రిల్ 15 -- Honor Killing: చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కన్నవారే పొట్టన పెట్టుకున్నారు. దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు నమ్మకంగా పుట్టింటికి తీసుకు వెళ్లి ఆమెను హతమార్చారు. చిత్తూరు పట్టణంలో జరిగిన పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువతిని బలిగొన్న తండ్రి, సోదరుడు పరారయ్యారు.

చిత్తూరు పట్టణంలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు సొంత కుమార్తెను కిరాతకంగా హతమార్చారు. దళిత యువకుడితో మతాంతర వివాహాన్ని వ్యతిరేకించిన యువతి తల్లిదండ్రులు పథకం ప్రకారం ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశారు. పరువు పేరుతో తన భార్యను హత్య చేశారని యువతి భర్త ఆరోపించాడు. యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులు పరారయ్యారు.

భార్యను పుట్టింటికి పంపి...