భారతదేశం, మార్చి 6 -- Honor Killing: అనంతపురం జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో కన్న తండ్రి కిరాతకుడిగా మారాడు. స్వయంగా ఉరితాడు ఆమె చేతికి ఇచ్చి.. చెట్టుకు ఉరేసుకోవాలని సూచించాడు. తండ్రి మాటల్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న అతను కనికరించలేదు. చెట్టు కొమ్మకు గిలగిల కొట్టుకుంటుంటే నింపాదిగా చూసి, ఆ తర్వాత శవాన్ని కిందకు దించి పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. ప్రేమ పెళ్లి చేసుకుంటానని అనడమే ఆమె చేసిన నేరమైంది.

అనంతపురం జిల్లాలో కూతురి ప్రేమ పెళ్లి ప్రతిపాదన తట్టుకోలేక పోయిన తండ్రి కిరాతకంగా వ్యవహరించాడు. కులాంతర వివాహం చేసుకుంటే కుటుంబం పరువు పోతుందంటూ సొంత కూతురు ప్రాణాలను బలి తీసుకున్నాడు. చేతికి ఉరి తాడు ఇచ్చి, చెట్టెక్కించాడు. తమ నిర్ణయాన్ని కాదంటే చనిపోవాలని బెదిరించాడు.

తండ్రి ఆదేశాల...