భారతదేశం, ఫిబ్రవరి 20 -- ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ స్ట్రీట్ నేకెడ్ బైక్ హార్నెట్ 2.0ను నవీకరించి విడుదల చేసింది. ఇప్పుడు కొత్త 2025 హోండా హార్నెట్ 2.0 అప్‌డేట్‌లో భాగంగా కొత్త ఫీచర్లతో పాటు కొత్త కలర్ ఆప్షన్‌ను పొందింది. ప్రస్తుత ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ రూ.1,56,953గా ఉంది. ఇది రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

కంపెనీ కొత్త OBD2B-కంప్లైంట్ హార్నెట్ 2.0తో మరింత మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ భద్రతా లక్షణాలతో కొత్త హార్నెట్ 2.0ను పరిచయం సంతోషిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఈ ప్రీమియం స్ట్రీట్ ఫైటర్ బైక్ నాలుగు రంగులలో అమ్మకానికి ఉంటుంది. అవి అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్...