భారతదేశం, ఫిబ్రవరి 5 -- మరికొన్ని రోజుల్లో మీరు హోండా కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. హోండా తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. న్యూస్ వెబ్సైట్ ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం, ఫిబ్రవరిలో హోండా ఎలివేట్ కొనుగోలుపై వినియోగదారులు భారీగా ఆదా చేయవచ్చు. డిస్కౌంట్ల వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

హోండా ఎలివేట్ మీద మంచి డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఎంవై(Model Year)2024 స్టాక్ జెడ్ఎక్స్ ఎంటి వేరియంట్ రూ .86,100 తగ్గింపును పొందుతోంది. ఎస్వీ, వీ, వీఎక్స్ ఎంటీ వేరియంట్లపై రూ.76,100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఎంవై 2025 స్టాక్ జెడ్ఎక్స్ ఎంటీ వేరియంట్ రూ .66,100 వరకు తగ్గింపును పొందుతోంది. అదే సమయంలో ఎస్వీ, వి, వీఎక్స్ ఎంటీ వేరియంట్లు రూ .56,...