భారతదేశం, మార్చి 10 -- హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) మోడల్ ఇయర్ 2024, మోడల్ ఇయర్ 2025 వెర్షన్‌లపై రూ. 90,000 వరకు నగదు తగ్గింపు అందిస్తున్నారు. అదే సమయంలో పెట్రోల్ వేరియంట్లపై(SV, V, XZ, ZX) రూ. 73,000 వరకు తగ్గింపు దొరుకుతుంది. అయితే హోండా సిటీపై ఆఫర్లు స్టాక్ లభ్యత, నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం కస్టమర్లు సమీపంలోని హోండా షోరూమ్‌ను సంప్రదించాలి.

దేశీయ మార్కెట్లో హోండా సిటీ సెడాన్ నాన్-హైబ్రిడ్ మోడల్ ధర రూ. 12.28 లక్షల నుండి రూ. 16.55 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంది. కాగా సిటీ హైబ్రిడ్ ధర రూ. 19 లక్షల నుండి రూ. 20.75 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.

హోండా సిటీ నాన్-హైబ్రిడ్ మోడల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. మీరు దీన్ని 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొనుగోలు...