Hyderabad, ఫిబ్రవరి 25 -- అవాంఛిత రోమాలు అమ్మాయిలను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. నలుగుకరిలోనూ నామూషీగా ఫీలయ్యేలా చేస్తాయి. దీర్ఘకాలికంగా ఇవి మహిళల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే వీటిని తొలగించుకోవడం చాలా అవసరం. మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, సబ్బులు ఎన్ని వాడినా అవాంఛిత రోమాలు తగ్గడం లేదని చాలా మంచి ఫిర్యాదు చేస్తుంటారు.పార్లర్ కు వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదని చెబుతుంటారు. పైగా వాటిని వాడటం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా డబ్బును వృథా చేయకుండానే, రసాయనాలతో కూడిన క్రీములు, సబ్బులు వాడకుండానే ఇంట్లోనే పాతకాలం పద్దతుల ఆధారంగా ఇంట్లోనే ఇలా సబ్బును తయారు చేసుకుని ఉయోగించండి. క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఈ సబ్బును వాడారంటే ముఖం మీద శరీరంలోని ఇతర భాగాల్లోని ...