Hyderabad, ఏప్రిల్ 5 -- OTT Web Series Home Town Review In Telugu: ఆహా ఓటీటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సరికొత్త ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ హౌమ్ టౌన్. పాపులర్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ భార్యాభర్తలుగా నటించిన హౌమ్ టౌన్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు.

ఈటీవీ విన్ ఓటీటీ బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి వచ్చిన హోమ్ టౌన్‌ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. రాజీవ్ కనకాల, ఝాన్సీతోపాటు ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి, అభయ్ నవీన్ తదితరులు నటించారు. ఏప్రిల్ 4 నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందో నేటి హౌమ్ టౌన్ రివ్యూలో తెలుసుకుందాం.

ప్రసాద్ (రాజీవ్ కనకాల)ది మధ్యతరగతి కుటుంబం. జ్యోతి అనే ఫొటో స్టూడియో రన్...