Hyderabad, ఫిబ్రవరి 23 -- తలలో పేల సమస్య పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఉంటుంది. అయితే మామూలు సమయంలో పర్లేదు కానీ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీటిని తొలగించకపోతే పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేరు. ఎప్పుడూ చూసినా చేయి తలలో గోక్కోవడానికి, ధ్యాస పేల కారణంగా వచ్చే దురద వైపుకీ మారుతుంది. పేల సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఇప్పటి వరకూ రకరకాల రెమిడీస్ ట్రై చేసి ఉంటారు, ఖరీదైన షాంపూలను కూడా వాడి విసిగిపోయి ఉంటారు. కానీ అవేవి కలిగించని ఉపశమనం ఈ రెమిడీ మీకు కలిగిస్తుంది.

ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే మీరే సహజమైన, శక్తివంతమైన హోం రెమిడీని తయారు చేసుకోవచ్చు. ఇది మీకూ, మీ పిల్లలకు పేల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. పరీక్షలు మొదలవకముందే షాంపూలో కొన్నింటిని కలిపి మీ పిల్లలకు తలస్నానం చేయించారంటే ఒక్క పేను కూడా లేకుండా పోతుంది. హాయిగా, ...