భారతదేశం, మార్చి 1 -- Home Minister Anitha : అనంతపురంలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..394 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు అభినందనలు తెలిపారు. శిక్షణ పొందిన వారిలో 300 సివిల్, 94 మంది ఏపీఎస్పీ ఎస్సైలు ఉన్నారన్నారు. సివిల్ ఎస్సై శిక్షణ పొందిన వారిలో 97 మంది మహిళలు ఉండడం గర్వకారణం అన్నారు.

"పోలీస్ గా సేవలందించేందుకు సిద్ధమై కఠిన పరీక్షలు ఎదుర్కోవడం ప్రశంసనీయం. బీటెక్, ఎంటెక్, బీకాం, బీఫార్మసి వంటి ఉన్నత చదువులు చదివిన వారుండడం పోలీస్ శాఖకు అదనపు బలం. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను అరికట్టాలి. శాంతి భద్రతల కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖలో రూ.900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారు.. అవన్నీ తీరుస్తున్నాం. ఇంతవరకు ఏపీకీ అప్పా లేదు. గ్రే హౌండ్స్ ...