భారతదేశం, ఆగస్టు 18 -- భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్ లోన్‌లు, ఇతర గృహ సంబంధిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఆగస్ట్​ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. లేటెస్ట్​ వివరాల ప్రకారం, ప్రస్తుతం సాధారణ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 7.50% నుంచి 8.70% వరకు ఉంది. ఎస్బీఐ తన గరిష్ట వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 8.45% నుంచి 8.70%కి మార్చింది. అయితే కనీస వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు.

ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లను 7.90% నుంచి అందిస్తుంది. ఈ రేటు హోమ్ లోన్‌లు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్‌లు, ఇంటి పునర్నిర్మాణ లోన్‌లు, ఇంటి విస్తరణ లోన్‌లకు వర్తిస్తుంది.

ఐస...