భారతదేశం, ఏప్రిల్ 26 -- ఇంటిని శుభ్రం చేసుకోకుంటే అనేక సమస్యలు వస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. చిందరవందరగా ఉంటే దురదృష్టానికి దారి తీస్తుంది. ఇల్లు మొత్తం చక్కగా, నీట్‌గా ఉంచుకోవడం మంచి అలవాటు మాత్రమే కాకుండా మానసికంగా, శారీరకంగా చురుకుదనం, సానుకూల శక్తిని ఇస్తుంది. ఎప్పుడూ ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరని వారు కనీసం ఇంట్లో ఈ ఆరు ప్రదేశాలను సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే దురదృష్టం దూరమవుతుంది. మానసిక, శారీరకంగా బాగుంటారు. అవి ఏంటో చూద్దాం..

ప్రవేశ మార్గమే ఇంటిపై మొదటి అభిప్రాయం. మంచి ఆలోచనలు, భావాలు రావాలి అంటే ఇదే ముఖ్యం. ప్రవేశ ద్వారం చిందరవందరగా ఉంటే, అదృష్టం రాదు. బూట్లు, కోట్లు, బ్యాగులు వేసి ఈ స్థలాన్ని అస్తవ్యస్తం చేయవద్దు. డోర్, ఫ్లోర్, మ్యాట్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. కాలింగ్ బెల్, డోర్క్‌నాబ్ సరిగ్గా పని చేస్తున్నాయని...