Hyderabad, ఆగస్టు 5 -- Hollywood Iron Man: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఎన్నో మూవీస్ చేసినా.. ఓ నటుడిని లేదా నటిని ఓ పాత్ర ప్రత్యేకంగా నిలుపుతుంది. అందులోనూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పాత్ర అయిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అలా ఇందులో ఐరన్ మ్యాన్ పాత్ర పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ 11 ఏళ్లలో ఈ పాత్ర పోషించడం ద్వారానే ఏకంగా రూ.5000 వేల కోట్ల వరకూ సంపాదించడం విశేషం.

రాబర్డ్ డౌనీ జూనియర్.. సుమారు ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్న నటుడు. అయితే అతని కెరీర్ అంతా ఓ ఎత్తయితే.. అతడు పోషించిన ఐరన్ మ్యాన్ పాత్ర మరో ఎత్తు. ఒక దశలో డ్రగ్స్ కు బానిసైన ఈ నటుడు.. తర్వాత మళ్లీ హాలీవుడ్ లోకి సహాయ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఐరన్ మ్యాన్ పాత్ర ద్వారా ఎక్కడికో వెళ్లిన తీరు ఎందరికో ఆదర్శనీయం.

2008లో ...