భారతదేశం, మార్చి 14 -- Holi tragedy: హోలీ రోజు తనపై రంగులు వేయవద్దు అని కోరిన ఒక 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు వ్యక్తులు గొంతు నులిమి చంపిన ఘటన రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. రాల్వాస్ గ్రామానికి చెందిన అశోక్, బబ్లూ, కలూరామ్ స్థానిక లైబ్రరీకి చేరుకుని హన్స్ రాజ్ అనే యువకుడిపై రంగులు పూశారు. అడ్డుకున్న హన్స్ రాజ్ ను గొంతునులిమి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్స్ రాజ్ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.

రంగులు పూసుకోవడానికి హన్స్ రాజ్ నిరాకరించడంతో ముగ్గురూ అతడిని తన్నారని, బెల్టులతో కొట్టారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) దినేష్ అగర్వాల్ తెలిపారు. నిందితుల్లో ఒకడు హన్స్ రాజ్ ను గొంతు నులిమి చంపాడని ఏఎస్పీ అగర్వాల్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హన్స్ రాజ్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాం...