భారతదేశం, మార్చి 4 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ పండుగ సందర్భంగా కాజీపేట జంక్షన్‌ మీదుగా చర్లపల్లి- హజ్రత్‌ నిజాముద్దీన్‌ మధ్య అప్‌ అండ్‌ డౌన్‌ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఎ.శ్రీధర్‌ ప్రకటన విడుదల చేశారు.

మార్చి 6,12, 16వ తేదీల్లో చర్లపల్లి- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (07707) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు 22.45 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8,14,18వ తేదీల్లో హజ్రత్‌ నిజాముద్దీన్‌-చర్లపల్లి (07708) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 07.30 గంటలకు చేరుకుంటుంది.

ఈ రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూ...