భారతదేశం, మార్చి 8 -- Holi Special Trains : రైల్వే ప్రయాణికుల‌కు వాల్తేర్ డివిజ‌న్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. హోలీ పండుగకు ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి నాలుగు ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది.

1. భువ‌నేశ్వర్‌-చర్లపల్లి హోలీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (08479) సోమవారాల్లో మార్చి 10, మార్చి 17, మార్చి 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12.10 గంటలకు గంట‌లకు భువ‌నేశ్వర్‌ నుండి రైలు బ‌య‌లుదేరుతుంది. సాయంత్రం 5.10 గంట‌ల‌కు విజ‌య‌న‌గ‌రం చేసుకుంటుంది. అక్కడ నుండి సాయంత్రం 5.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, దువ్వాడ సాయంత్రం 6.30 గంట‌ల‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 6.32 గంట‌ల‌కు బ‌య‌లుదేరి మంగ‌ళ‌వారం ఉద‌యం 7.50 గంట‌ల‌కు చ‌ర్లప‌ల్లి ...