Hyderabad, మార్చి 10 -- దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ ఈ ఏడాది మార్చి 14న జరుగుతుంది. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకూ ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళిలో దీపాలు, సంక్రాంతికి ముగ్గులు, హోళీలో రంగులు. ఇవి లేకుండా ఈ పండుగలు అసంపూర్ణంగా ఉంటాయి. ప్రస్తుతం దేశ ప్రజలు హోళీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. పిండి వంటలు, స్వీట్లతో పాటు ప్రియమైన వారిపై ప్రేమ రంగులు చల్లడానికి వివిధ రకాల రంగులు, స్ప్రేలు కొనుగోలు చేస్తున్నారు. రంగులు కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మరొకటి ఉంది.

రంగుల పండుగ హెలీలో వాడే ప్రతి రంగుకూ ప్రత్యేకమైన అర్థం ఉంటుందట. వాటిని బట్టే ఎవరి మీద ఏ రంగు వేయాలో నిర్ణయించుకోవాలట. మరి హోలీ రంగుల వెనకున్న నిజమైన అర్థం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి. రంగుల అర్థాన్ని బట్టి ఎవరి మీద ఏ రంగ...