Hyderabad, మార్చి 12 -- హోలీ అంటే చాలు, ఎన్నో ప్రాంతాల్లో గుజియా స్వీట్లు విపరీతంగా అమ్ముడుపోతాయి. గుజియాను మనం కజ్జికాయలు అని పిలుచుకుంటాం. లోపల కోవా లేదా కొబ్బరి కోరును పెట్టి ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. హోలీ సమీపిస్తున్న కొద్ది నెయ్యిలో వేయించిన గుజియాల వాసన ప్రతి ఇంట్లో ఘుమఘుమలాడిపోతుంది. ఈ రంగుల పండుగకు ప్రత్యేకమైన స్వీటు కజ్జికాయలు. డ్రైఫ్రూట్స్, కోవా, కొబ్బరి తో నిండి ఉండే ఈ కజ్జికాయ వెనక ఎంతో చరిత్ర కూడా ఉంది.

పురాతన సంస్కృత గ్రంథాల ప్రకారం కరణిక అని పిలిచే తీపి పదార్థం ఒకప్పుడు ఉండేది. దీనిని అప్పట్లో ఎండిన పండ్లు, తేనెతో చేసే వారిని చెప్పుకుంటారు. మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా కజ్జికాయ వంటి స్వీట్లు ఉన్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది భిన్నమైన చంద్రవంక ఆకారంలో ఉండేవని శిల్పాల ద్వారా తెలుస్తున్నాయి.

అయితే గుజియాకు టర్కీ...