భారతదేశం, మార్చి 10 -- హోలీ పండుగ నేపథ్యంలో రియల్‌మీ తన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రత్యేకంగా హోలీ పండుగ కోసం కంపెనీ పరిమిత కాల డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. ఇక్కడ రియల్‌మీ మార్చి 15, 2025 వరకు తన స్మార్ట్‌ఫోన్‌లపై రూ.9,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు తాజా రియల్‌మీ 14 ప్రో సిరీస్, జీటీ 7 ప్రో, జీటీ 6టీ, రియల్‌మీ పీ3 సిరీస్ వంటి అనేక మోడళ్లకు వర్తిస్తాయి.

రియల్‌మీ ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్స్‌తో అదనపు పొదుపులను పొందవచ్చు. ఎంపిక చేసిన ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుదారులు తమ పాత పరికరాలను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా అదనపు తగ్గింపులను పొందవచ్చు. వాయిదాలలో చెల్లించాలనుకునే వారికి 3 నుండి 12 నెలల వరకు ఈఎంఐ ప్లాన్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆఫర్లన్నీ మార్చి 15, 2025 ...