భారతదేశం, మార్చి 14 -- మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొబ్బరి నూనెను చుట్టూ రాసుకున్న తరువాత మాత్రమే హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాలి. అందుబాటులో ఉంటే.. సన్ గ్లాస్‌ పెట్టుకోవాలి. దీనివల్ల ఆహ్లాదకరమైన లుక్స్ తోపాటు.. కళ్లకు సైతం రక్షణ కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు కళ్లలోకి రంగు చేరితే.. శుభ్రంగా కడగాలి. మీముఖాన్ని కిందకు వంచి కళ్లు తెరవడానికి ప్రయత్నించాలి.

కళ్లల్లో రంగులు పడితే.. అరచేతుల మధ్య నీళ్లను ఉంచుకుని కళ్లను మూసి తెరిచేందుకు ప్రయత్నించాలి. కళ్లలో నీళ్లు కొట్టడం చేయవద్దు. ఇలా చేస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రదనం మరింత ఎక్కువ కావడం, నీరు కారడం, దురద, అసౌకర్యంగా ఉండటం, ట్రౌమా, రక్తస్రావం అయితే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. కంటికి దగ్గరలో రంగులు పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలు...