భారతదేశం, జనవరి 5 -- చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులను నిర్వహించడానికి భారతదేశం "బాగా సిద్ధంగా ఉంది" అని, చైనాలో పరిస్థితి "అసాధారణం కాదు" అని పేర్కొంది.

గత కొన్ని వారాలుగా చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ అనారోగ్యం నివేదికల మధ్య, భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యక్షతన దిల్లీలో శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), విపత్తు నిర్వహణ (డీఎం) సెల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఎమ...