భారతదేశం, ఫిబ్రవరి 7 -- HMDA Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 8 రోజుల పాటు కస్టడీలో ఉన్న శివబాలకృష్ణ నుంచి ఏసీబీ కీలక వివరాలు రాబట్టింది. నేటితో ఏసీబీ కస్టడీ ముగిసింది. అయితే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శిగా శివబాలకృష్ణ పనిచేసినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు మంజూరు చేసిన అనుమతులపై ఏసీబీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 8 రోజుల కస్టడీలో శివబాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ...కీలక సమాచారం రాబట్టింది. ఆయనకు ముగ్గురు బినామీలు ఉన్నట్లు గుర్తించారు.

శివబాలకృష్ణ తన పేరిట, బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ...