భారతదేశం, మార్చి 12 -- HMDA Limits Extended : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్‌, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో కొత్తగా 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేరనుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి...హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు ఉన్నాయి.

తెలంగాణ సర్కార్ హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చ...