భారతదేశం, ఏప్రిల్ 13 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'హిట్ 3' (హిట్: థర్డ్ కేస్) సినిమాకు క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీ ఎంత వైలెంట్‍గా ఉండనుందో టీజర్ ద్వారానే తెలిసిపోయింది. దీంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. హిట్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ఈ మూవీ వస్తోంది హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో హిట్ 3 ట్రైలర్ వచ్చేస్తోంది. టైమ్ కూడా ఖరారైంది.

హిట్ 3 సినిమా ట్రైలర్ రేపు (ఏప్రిల్ 14) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వాల్ పోస్టర్ సినిమా నేడు (ఏప్రిల్ 12) అధికారికంగా వెల్లడించింది. డేట్ ఇప్పటికే ఖరారు కాగా.. టైమ్‍ను ఇప్పుడు ప్రకటించింది మూవీ టీమ్. రేపు 11.07 గంటలకు ఎంతో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేయనుంది.

హిట్ 3 ట్రైలర్ రిలీజ్ కోసం ఈవెంట్ కూడా జరగనుంది....