Hyderabad, ఏప్రిల్ 4 -- HIT 3 OTT: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాలో అతడు లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్నాడు. మే 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. నాని తొలిసారి ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు.

హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తొలి భాగంలో విశ్వక్సేన్, రెండో భాగంలో అడవి శేష్ లీడ్ రోల్స్ పోషించగా.. ఇప్పుడు మూడో పార్ట్ లో నాని వస్తున్నాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. తాజాగా ఓటీటీప్లేలో వచ్చిన వార్తల ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

దీని కోసం ఆ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.54 కోట్లు పెట్టడం విశేషం. నాని కెరీర్లో ఓ సినిమా డిజిటల్ హక్కుల కోస...