భారతదేశం, నవంబర్ 29 -- Hit 2 Pre Release Event: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాట ప్రేక్షకులను మెప్పించడంతో అంచనాలు భారీగా ఎర్పడ్డాయి. సోమవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి విచ్చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్ల కోసం విదేశాలకు వెళ్లిన ఆయన ఆదివారమే ఇక్కడకు వచ్చారు. వచ్చిరావడంతోనే హిట్ 2 ఈవెంట్‌కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నేచురల్ స్టార్ నాని అన్నారు.

"హిట్ ఫ్రాంఛైజీలో 3,4,5.. ఇలా 7 భాగాలు వస్తాయి. చివరి పార్ట్‌లో అందరి హీరోలను కల...