Hyderabad, ఏప్రిల్ 4 -- Highest Grossing Malayalam Movie: మలయాళం బ్లాక్‌బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ రికార్డు ఏడాది కూడా నిలవలేదు. తాజాగా మాలీవుడ్ స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ 8 రోజుల్లోనే ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడీ మూవీ మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కావడం విశేషం.

ఆరేళ్ల కిందట మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ జోడీ లూసిఫర్ మూవీతో మలయాళం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మరోసారి ఎల్2: ఎంపురాన్ తో మరోసారి హిస్టరీ రిపీట్ చేశారు. తాజాగా ఈ మూవీ 8 రోజుల్లోనే రూ.250 కోట్లకుపైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళం సినిమాగా నిలిచింది.

ఈ మూవీ ఇండియాలో రూ.88.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎల్2 ఎంపురాన...