భారతదేశం, జనవరి 27 -- High Court On Theatres : సినిమా థియేటర్లకు 16 ఏళ్ల లోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సరైన సమయం లేకుండా... పిల్లలు థియేటర్లకు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం....16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లకు తగిన సమయాల్లోనే అనుమతించాలని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తద...