Hyderabad, ఫిబ్రవరి 21 -- హైబీపీతో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా అధిక రక్తపోటు బారిన ఎక్కువ మంది పడుతున్నారు. దీనిని అదుపులో ఉంచుకోవడానికి మీరు వైద్యుని సలహాతో పాటు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేదం ద్వారా కూడా మీరు దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. ఆయుర్వేదంలో మూడు దోషాలను (వాతం, కఫం, పిత్తం) సమతుల్యంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. ఈ మూడు సమతుల్యంగా ఉండే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. మీ రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం, మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి, మీరు రోజూ ఉదయం వెల్లుల్లి నీటిని తాగాలి. వాస్తవానికి, వెల్లుల్లిలో 'అల్లిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్త నాళాలను సడలించడానికి స...