Hyderabad, జనవరి 25 -- 12 Heroines In My South Diva Calendar 2025 Launch: ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్‌ దివా క్యాలెండర్‌ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. స్టార్స్‌గా క్రేజ్ అందుకున్నారు. తాజాగా మై సౌత్ దివా 2025 క్యాలెండర్‌ను 12 మంది స్టార్స్‌తో శుక్రవారం (జనవరి 24) గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్‌తో మై సౌత్ దివా క్యాలెండర్ 2025ను శుక్రవారం హైదరాబాద్‌లో కలర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లో క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, ద...