Hyderabad, ఏప్రిల్ 3 -- Tammareddy Bharadwaja About Heroines Casting Couch: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్లలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. 2006లో ఉత్తమ చిత్రంగా నంది అవార్డ్ అందుకున్న పోతే పోని సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించారు, రూపొందించారు.

రీసెంట్‌గా సుమారుగా నెల రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. "సినిమా ఇండస్ట్రీ నుంచి సీనియర్ డైరెక్టర్స్, సినిమాలు చేయని వాళ్లు బయటకు వచ్చి వాళ్లు వీళ్లతో (అఫైర్స్/కాస్టింగ్ కౌచ్) అని చాలా ఎపిసోడిక్‌గా చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేస్తున్నారు" అని యాంకర్ అడిగారు.

"ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. సినిమాల్లో క్యాస్ట...