భారతదేశం, మార్చి 11 -- హీరో స్ప్లెండర్ మోటర్ సైకిళ్లకు డిమాండ్ ఎక్కువ. మధ్యతరగతివారు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే హీరో స్ప్లెండర్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. రాబోయే 2025 స్ప్లెండర్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడానికి కొత్త మోడల్ ప్రధాన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ బైక్ ఇప్పుడు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. ఇది 240 మిమీ యూనిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రమ్ బ్రేక్ సెటప్ కంటే మెరుగైన స్టాపింగ్ శక్తిని ఇస్తుంది. స్ప్లెండర్ ప్లస్‌ను దాని ఎక్స్ టీఈసీ డిస్క్ వేరియంట్‌తో సమానంగా తీసుకువస్తుంది. ఇది అన్ని రకాల రోడ్లపై సురక్షితంగా ఉంటుంది.

హీరో కొత్త స్ల్పెండర్ ప్లస్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో క్యాండీ రెడ్ కూడా ఉంది. ఇది కాకుండా మ్యాట్ యాక్సిస్ గ్రే ...