భారతదేశం, మార్చి 12 -- నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టిస్తోన్న రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాబిన్‌హుడ్ మూవీలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

మంగ‌ళ‌వారం యూనిట్ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో రాబిన్‌హుడ్‌ను ఉద్దేశించి నితిన్ మాట్లాడుతూ "అది దా సర్ప్రైజ్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. దిల్ రాజు వల్ల ఆ వర్డ్ పాపులర్ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. డైరెక్టర్ వెంకీ, నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఓ గంట సేపు ప్రేమించుకొని...కౌగిలించుకొని...ఆల్‌మోస్ట్ కామించుకోబోయి ఆపుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యుజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను.

నా బర్త్ డే మార్చ్ 30. ఈ...