భారతదేశం, ఫిబ్రవరి 24 -- Hero Nani: టాలీవుడ్‌లో కొత్త‌ద‌నానికి ప్రాధాన్య‌మిచ్చే హీరోల్లో నాని ముందువ‌రుస‌లో ఉంటాడు. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ నాని చేసిన ప‌లు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా నాని కొన‌సాగుతోన్నాడు. హిట్ 3తో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు. ప్రొడ్యూస‌ర్‌గా కోర్టు సినిమాను నిర్మిస్తున్నాడు.

త‌మిళంలోనూ హీరోగా త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్నాడు నాని. రెండు సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. వెప్పం మూవీతో హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అంజ‌నా అలీఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

ఈ మూవీలో నిత్యామీన‌న్‌, బిందుమాధ‌వి హీరోయిన్లుగా న‌టించారు. సెగ పేరుతో తెలుగులోకి వెప్పం మూఈ డ‌బ్ ...