భారతదేశం, ఏప్రిల్ 11 -- అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్​లోని హడ్సన్​ నదిలో ఒక హెలికాప్టర్​ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో నలుగురిని రక్షించి, న్యూజెర్సీలోని ఆసుపత్రికి తరలించారు.

న్యూయార్క్​లోని వెస్ట్​సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మెరైన్, ల్యాండ్ ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్లు వంటి అత్యవసర సేవలను న్యూయార్క్ హెలికాప్టర్ ప్రమాద స్థలానికి పంపించారు.

హడ్సన్ నదిపై గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో స్పెయిన్​లోని సీమెన్స్ అనే కంపెనీ అధ్యక్షుడు, సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, వారి ముగ్గురు పిల్లలు మరణించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

ప్రమాదం సమయంలో హెలికాప్టర్​ని నడిపిన పైలట్ ఎవరనే విష...