Hyderabad, ఏప్రిల్ 8 -- ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి, వేడి తీవ్రత కూడా పెరుగుతోంది. ఇండియన్ మీటెరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం రానున్న రోజుల్లో ఢీల్లీలో ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఎండీ అంచనాల ప్రకారం.. భారతేదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడ ఈ ఏడాది భారీ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్లు, ఏప్రిల్ నుండి జూన్ వరకు వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయట. దీని వలన వేడి మరింత పెరగవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలు వేడి తాపానికి అనారోగ్యం పాలవచ్చు.

రానున్న రోజుల్లో వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని IMD ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ, వేడి కారణంగా తలెత్తే ఇతర సమస్య నుండి రక్షించుకోవడానికి ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఇండియన్ మీటెరాలాజికల్ డిపార్...