Hyderabad, ఫిబ్రవరి 22 -- గుండె జబ్బు లక్షణాలు అనే మాట వినగానే, ముందు గుర్తొచ్చేది ఛాతిలో నొప్పి, ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భుజం భాగంలో నొప్పి వంటివి. కానీ, శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె పనితీరులో సమస్యలను ఇతర లక్షణాల ద్వారా కూడా తెలుసుకోవచ్చట. ముఖ్యంగా శరీర భాగాలకు గుండె నుంచి మంచి రక్తాన్ని మోసుకుపోయే ధమనుల్లో ఏమైనా ఆటంకాలు కలిగితే కాళ్లలో సమస్యగా అనిపిస్తుందట. అదెలాగో తెలుసుకుందామా!

"కాళ్లు లేదా పాదాలలో బ్లాక్ అయిన హృదయ ధమనులను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD)గా పిలుస్తారు, ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ప్రధానంగా కనిపించే లక్షణాలలో కాలు నొప్పి, బలహీనమైన నాడీ స్పందనలు, చర్మం రంగులో మార్పులు,ఏదైనా పుండు కలిగితే అది తగ్గడానికి ఎక్కువ సమయం పట్టడం వంటివి, ధమనుల్లో సమస్య ఏర్పడుతుందని తెలియజేస్తుంటాయ...