Hyderabad, జనవరి 29 -- విమానాశ్రయానికి సమీపంలో నివసిస్తున్న వారి సంఖ్య మనదేశంలో ఎక్కువే. ఇలా విమానాశ్రయానికి దగ్గరలో జీవిస్తున్న వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. అందులో విమానాశ్రయం నుంచి వచ్చే జెట్ ఇంజిన్ల శబ్దం ఊహించని దానికంటే ఎక్కువ ప్రమాదకరమని తేలింది. పెద్ద విమాన శబ్దం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో బయటపడింది. విమాన శబ్దాన్ని తరచూ వినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, క్రమరహిత హృదయ స్పందనలకు దారితీస్తుందని అధ్యయనం తెలిపింది.

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం లండన్ లోని హీత్రూ, గాట్విక్, బర్మింగ్ హామ్, మాంచెస్టర్ విమానాశ్రయాల సమీపంలో నివసించే ప్రజలు హృదయనాళ పనితీరులో 10 నుండి 20 శాతం లోపాలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. యూనివర్శిటీ కాలేజ్ లండ...