Hyderabad, ఫిబ్రవరి 5 -- ఏటా ఎంతో మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా గుండె పోటు సమస్యలు ఎక్కువైపోతోంది. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. సైలెంట్ కిల్లర్ లా గుండెపోటు వచ్చి ప్రాణాలు తీస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం రెండు రకాల ఆహారాలు గుండెకు హాని చేస్తాయి. వాటిని దూరం పెట్టాల్సిన అవసరం అందరికీ ఉంది.

చక్కెర కంటెంట్, సోడా కంటెంట్, ప్రాసెస్ చేసిన మాంసాలు, కూల్ డ్రింక్స్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె, రక్త నాళాలలో దీర్ఘకాలిక మంటకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రాసెస్...