Hyderabad, ఫిబ్రవరి 12 -- ఇప్పటికే చాలా సంఘటనలు, వీడియోలు వైరల్ గా మారాయి. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన యువత ఎంతోమంది ఉన్నారు. ఈమధ్య కూడా ఒక సంగీత్ కార్యక్రమంలో పాతికేళ్ల యువతి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిపోయింది. ఇలా నాట్యం చేస్తున్నప్పుడే ఎక్కువమంది గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

నాట్యం అధికంగా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నాట్యం చేస్తున్నప్పుడు గుండె స్పందన మారిపోతుంది. ఇది క్రమరహితంగా మారిపోవచ్చు. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండెపోటు సమస్య ఉంటే అలాంటి వారికి నృత్యం చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి....