Hyderabad, జనవరి 31 -- ఒకప్పటి పరిస్థితి వేరు. గుండెపోటు సమస్య కేవలం వయసు ముదిరిన వాళ్లలోనే కనిపించేది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి గుండె పోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. చుట్టుపక్కల వారికి ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. ఇలా చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలబెట్టినవారు అవుతారు. గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలని ఆరోగ్య నిపుణులు తరచూ సూచిస్తూనే ఉంటారు. సిపిఆర్ చేయడం వల్ల గుండె తిరిగి కొట్టుకోవడం మొదలై ప్రాణం నిలబడుతుంది. అదేవిధంగా గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నీరు ఇవ్వాలా వద్దా అనే సందేహం కూడా ఎక్కువమందిలో ఉంది. ఈ సందేహానికి వైద్యులు సమాధానం ఇస్తున్నారు.

మీ చుట్టుపక్కల ఉన్నవారికి లేదా బంధువులకు మీ ముందే గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి నీటిని అందించకూడద...