Hyderabad, మార్చి 26 -- గుండె పోటు ప్రాణాంతకమైనదే, కానీ సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చు. భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి అవగాహన పెంచుకుంటే వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అయితే గుండెపోటు లక్షణాలు తెలియక కొంతమంది ఆ సంకేతాలను విస్మరిస్తున్నారు.

గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎక్కువగా నూనె పదార్థాలు, తినేవారిలో వ్యాయామం చేయని వారిలో చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ధమనుల్లో, సిరల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కొట్టుకునే ...