Hyderabad, ఫిబ్రవరి 12 -- పోషకాలు కేవలం ఖరీదైన ఆహార పదార్థాల్లోనే కాదు, తక్కువ ఖర్చుతో దొరికే వాటిలో కూడా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా తింటే తక్కువ ఖర్చులోనే ఎక్కువ పోషకాలను పొందవచ్చు. ధర తక్కువగా ఉండే వాటిలో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయ అనుకోవద్దు. అలా ధర తక్కువగా ఉండే మంచి పోషకాహారం పచ్చి కొబ్బరి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.

పచ్చికొబ్బరి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి ఖరీదైనది కూడా కాదు. అందుకే కొబ్బరిని పచ్చిగా తినవచ్చు. రోజుకు ఒక ముక్క తినండి చాలు. దీన్ని నేరుగా తినయవచ్చు. దీనిని వివిధ రకాల ఆహారాలలో ఉపయోగించవచ్చు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చికొబ్బరిలో మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి, సి, డి, ఇ కూడా ఉన్నా...