Hyderabad, మార్చి 16 -- ఉదయం లేవగానే చక్కటి సాంబార్‌తో ఇడ్లీ తింటున్నారా? లేదా ఒకటి రెండు రకాల చట్నీలతో దోసెలు వేసుకుని తింటున్నారా? వీటితో పాటు ఉప్మా, చపాతీలు, పూరీలు, బోండాలు, పునుగులు అంటే రకరకాల పదార్థాలు తింటున్నారా? ఇవన్నీ రుచికరమైనవే. వీటిని కొన్ని ఆరోగ్యానికి కూడా మేలు చేసేవే. అయినప్పటికే వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తినాలి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? కలిగితే ఇది కథనం మీ కోసమే. ప్రతిరోజూ ఇడ్లీ, దోస వంటివి తినడం మంచిదేనా? ఆరోగ్యకరమైన టిఫిన్లు అంటే ఏంటి అనే విషయాలను ప్రముఖ సిద్ధవైద్య నిపుణులు కే.శివరామన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

ఇడ్లీలు, దోసలు, చపాతీలు వంటి ఆరోగ్యానికివి మంచివే. అలాగని ఒకేసారి పిండి రుబ్బ...