భారతదేశం, ఏప్రిల్ 23 -- సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. జీవితంలో ఏదో ఒకటి జరుగుతుందిలే.. అని చూస్తూ వెళ్లిపోయేవారు చాలా మందే ఉంటారు. కానీ మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. భవిష్యత్ జీవితం కోసం ఈ రోజు ఆలోచించేవాడు భవిష్యత్తులో కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు. కానీ మనం దీని గురించి ఆలోచించడం లేదు.

అందరం భవిష్యత్తు కోసం బీమా చేస్తాం. క్లిష్ట సమయాల్లో బీమా రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య బీమా చాలా ప్రయోజనకరం. మీకు ఆరోగ్య బీమా లేకపోతే, ముందుగా దీన్ని చేయండి. ఎవరి ఆరోగ్యం ఎప్పుడు క్షీణిస్తుందో చెప్పలేం. అందువల్ల ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యమైన అంశం.

ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాకు అర్హులు కాదు. గతంలో భారతదేశంలో 65 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమా వర్తించేది కాదు. అయ...