భారతదేశం, జూలై 2 -- హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు మార్కెట్‌లోకి రాబోతోంది. ఐపీఓకు వచ్చిన బలమైన స్పందన, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సంకేతాలను బట్టి చూస్తే, ఈ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో మంచి లాభాలతో అడుగుపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జూన్ 27న ముగిసింది. ఈ ఐపీఓ ఏకంగా 27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యిందంటేనే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ఈక్విటీ షేర్లు నేడు అంటే 2025, జూలై 2న బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE)లలో లిస్ట్ కానున్నాయి.

బీఎస్‌ఈ విడుదల చేసిన నోటీసు ప్రకారం "2025 జూలై 2, బుధవారం నుండి హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు 'బి' గ్రూప్ సెక్యూరిటీల జాబి...