తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 2 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల వేలాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 400 ఎకరాల భూ వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తరగతులను బహిష్కరించిన విద్యార్థులు. బుధవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ చేపట్టారు.

ఓవైపు విద్యార్థుల భారీ ర్యాలీ ఉండగా. మరోవైపు పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఈ క్రమంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

గడిచిన నాలుగు రోజులుగా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనలను ఉద్రితం చేస్తున్నారు. భూముల అమ్మకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 400 ఎకరాల భూములను యూనివర్సిటీక...